రాఘవయ్య నగర్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ త్రిభువన…
స్పెషల్ కరస్పాండెంట్ :- ఉదయ్ సామినేని
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ త్రిభువన శుక్రవారం వెంకటేశ్వర నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని 12వ డివిజన్ అష్టలక్ష్మి గుడి దగ్గర ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి హాజరైన వారికి బిపి కొలెస్ట్రాల్ కిళ్ళు షుగర్ మరియు బూస్టర్ డోస్ వేసి తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాలు కురిసిన తదుపరి డెంగ్యూ మలేరియా టైపాయిట్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని తెలిపారు దోమల వ్యాపి నివారణకు తమ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, బిక్కసాని జేస్వంత్, ఉట్ల జగన్ మరియు ఆశ వర్కర్లు వెంకటలక్ష్మీ, రమాదేవి, ఎన్ఎం లక్ష్మీప్రసన్న, ల్యాబ్ టెక్నీషియన్ ఉమాదేవి, సూపర్వైజర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply