టాలీవుడ్ నటి హేమకు ‘మా’ అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెంగళూర్ రేవ్ పార్టీకి హాజరైనట్లు రుజువు కావడంతో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడటంతో హేమ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే హేమపై ‘మా’ వేటు వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Leave a Reply