పాపం కేసీఆర్ కు ఒక వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్‌ అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల అణచివేతలైపోయాయి.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయంటూ విమర్శించారు. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు, జాతీయ పార్టీల జిమ్మిక్కులు కూడా అయిపోయాయని పేర్కొన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలయ్యాయంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.