జిల్లాలో ఇండియా కూటమిని బలోపేతం చేయాలి!…ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు

స్టేట్ న్యూస్ తెలుగు / ఖమ్మం

ఖమ్మం లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిని బలోపేతం చేసి పాసిస్టు బిజేపి ని ఓడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు పిలుపు నిచ్చారు.మంగళవారం ఖమ్మం జిల్లా కార్యాలయం లో  జిల్లా అధ్యక్షుడు స్వర్ణ సుబ్బారావు అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.మరోసారి మోదీ ప్రధానమంత్రి అయితే గుడులు,జైళ్ళు తప్ప మరే అబివృద్ధి ఉండదని, ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కార్పోరేట్ శక్తులకు దేశాన్ని దోచి పెడుతూ.. మతం పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ.. పరిపాలన అధోగతి కి తీసుకెళుతున్నాడని విమర్శించారు.ప్రతిపక్ష నాయకులు పై ఇడి, సిబిఐ లను ఉసిగొల్పి మోదీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆయన దుయ్యబట్టారు.అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన  ఆమ్ఆద్మీపార్టీ   పార్టీని బద్నాం చేసేందుకు బిజేపి కుట్రలు చేస్తుందని, ఆమ్ఆద్మీపార్టీ  అద్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నికల ముందు అరెస్టు కు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు.రైతులు తమ పంటలకు చట్టబద్దమైన గిట్టుబాటు ధర కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వం వారిపై నిర్బంధం కు బదులు చర్చలు జరిపి రైతుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఆయన కోరారు.అనంతరం  ఆమ్ఆద్మీపార్టీ    జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పుల్లయ్య కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి లో బాగస్వామ్య పార్టీలైన ఆమ్ఆద్మీపార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లతో సమన్వయం ఏర్పరచాలి, ఇండియా కూటమి సమన్వయ కమిటీ కొరకు కాంగ్రెస్ చొరవచూపాలని ఆయన కోరారు.జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు సభ్యత్వం నమోదు విస్తృతంగా చేపట్టాలని, ఖమ్మం లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఎండలు మండిపోతున్న ందున జిల్లా ప్రజల త్రాగునీరు సమస్య పరిష్కారం కొరకు సాగర్ జలాలు విడుదల కు చర్యలు తీసుకోవాలని, గ్రామాల లోని చెరువులు, కుంటలు సాగర్ జలాలు తో నింపిలని జిల్లా కమిటీ తీర్మానం చేసింది. జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పసుమర్తి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ డి ఎల్ రాంబాబు, కోశాధికారి చల్లా కల్పన తదితరులు పాల్గొన్నారు.  ఆమ్ఆద్మీపార్టీ నీ బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని జిల్లా కమిటీ తీర్మానం చేసింది.