Author: Alajadi News
-
లోక్‌సభ రద్దు.. రాష్ట్రపతి ఉత్తర్వులు
లోక్‌సభను రద్దు చేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సూచించింది. కేబినెట్ సలహాను రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో 17వ లోక్‌సభ రద్దైంది. కాసేపటిలో NDA నేతలు రాష్ట్రపతిని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కానున్నారు
-
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్
మొత్తం పోలైన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి ఒక లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44 వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం. మొదటి ప్రాధాన్యత…
-
నటి హేమకు షాక్ ఇచ్చిన ‘మా’ అసోసియేషన్.. సభ్యత్వం రద్దు!
టాలీవుడ్ నటి హేమకు ‘మా’ అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెంగళూర్ రేవ్ పార్టీకి హాజరైనట్లు రుజువు కావడంతో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడటంతో హేమ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే హేమపై ‘మా’ వేటు వేసేందుకు సిద్ధమైనట్లు…
-
వార్డెన్లు, హెచ్ఎం లు దొరికిపోయారు…
భద్రాచలం , ఐటీడీఏ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో ఇటీవల కాలంలో పలు అంశాలపై సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరుతూ ఓ దరఖాస్తు దాఖలైంది. దరఖాస్తుకు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని ఆదేశిస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పౌర సమాచార అధికారి కె ప్రమీలబాయి సంబంధిత ప్రతిని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలకు, ఆశ్రమ పాఠశాలలకు దరఖాస్తుదారుని ప్రశ్నలతో…
-
అయ్యో రామా..! దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు. ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో…
-
సీఎం రేవంత్ ‘ఎక్స్’ అకౌంట్ బ్లూటిక్ మాయం.. హ్యాక్ చేశారంటూ అనుమానాలు, అధికారుల క్లారిటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ ఉన్న అధికారిక ఖాతా ‘బ్లూ టిక్’ మార్క్ లేకపోవడంతో ఎవరో హ్యాక్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఖాతాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రొఫైల్ పిక్చర్ లో మార్పు కారణంగా ఇది టెక్నికల్ ఇష్యూ అని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. రెండు రోజుల్లో బ్లూ టిక్ పునరుద్ధరించబడుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఎక్స్ లో ముఖ్యమంత్రి ఖాతా నుంచి బ్లూ టిక్ మార్క్ కనిపించకపోవడంతో నెటిజన్లు…
-
ఏపీ రాజకీయ రణరంగంలోకి మెగాస్టార్.. జనసేన కోసం కాకుండా ఆ పార్టీ కోసం ప్రచారం?
మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ తరఫున చురుగ్గా ప్రచారం చేస్తారని ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం లోకసభ స్థానం అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ఇటీవల ఆయన రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ…
-
తెలంగాణవాసులకు చల్లని కబురు.. మూడు రోజులు వానలే వానలు.!
భానుడు నిర్దాక్షిణ్యంగా సెగలు కక్కుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి దంచేస్తుండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికితోడు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
-
తెలంగాణ రాజకీయంలో రాముడి భజన! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయపడ్డాయంటున్న బీజేపీ!
తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన ఎజెండా అవుతున్నాడు. మారుతున్నాడు.ఇన్నాళ్లూ బీజేపీ పేటెంట్‌గా భావించిన జై శ్రీరామ్ నినాదాన్ని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సైతం భుజానికెత్తుకోవడం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతోంది. రాముణ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం.. రాముడు మాకూ దేవుడే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం.. ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవడం.. ఇదంతా కూడా పాలిటిక్స్‌లో సరికొత్త మలుపుగా చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయం-అంతా…
-
తెలంగాణ రాజకీయంలో రాముడి భజన! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయపడ్డాయంటున్న బీజేపీ!
తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన ఎజెండా అవుతున్నాడు. మారుతున్నాడు.ఇన్నాళ్లూ బీజేపీ పేటెంట్‌గా భావించిన జై శ్రీరామ్ నినాదాన్ని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సైతం భుజానికెత్తుకోవడం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతోంది. రాముణ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం.. రాముడు మాకూ దేవుడే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం.. ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవడం.. ఇదంతా కూడా పాలిటిక్స్‌లో సరికొత్త మలుపుగా చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయం-అంతా…