సోమవారం నాడు భద్రాచలం ఐటీడీఏ ముందు గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది . అనంతరం ఐటీడీఏ పిఓ గారికి మెమోరాండం ఇస్తూ భద్రాచలంలో లా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్నటువంటి భద్రాచలంలో లా కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసి విద్యార్థులు ఎంతో కొంత న్యాయ శాస్త్రంలో చదువుకోవడానికి ముందుకు వెల్లగలుగుతారని అన్నారు.
దుమ్ముగూడెం మండలంలో గతంలో చేరిపల్లి, మారాయి గూడెం, తునికి చెరువు కు నడిపిన ఆర్టీసీ బస్సును అర్ధాంతరంగా నిలిపివేసిన ఆర్టీసీ అధకారులు చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఫ్రీ బస్సు సర్వీసు నడుపుతా ఉంటే దుమ్ముగూడెం ఏజెన్సీలో మాత్రం ఆదివాసీలకు అది అందని ద్రాక్ష గానే మారిందనీ గోండ్వానా లా కళాశాల ఏర్పాటు చేసే అంతవరకు దశల వారి ఉద్యమాలు చేపడతామని అలాగే జూన్ మొదటి వారంలో హైదరాబాద్ ఇందిరా పార్కు ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర రాంబాబు రాష్ట్ర కార్యదర్శి పునెం సాయి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కనితీ వెంకటకృష్ణ పూనేమ్ ప్రతాప్ సున్నం సుబ్బయ్య పాయం సన్నాసి సోడి వెంకటేశ్వర్లు గడ్డం వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు..
Leave a Reply