ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్:మార్చి 06(స్టేట్ న్యూస్ తెలుగు)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది.

ఈ మేరకు రుణం పొందేందుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది.

గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగనించనుంది.