మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతస్థాయి పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రిగారి చేతుల మీదుగా శంకుస్థాపన.

ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవన సముదాయం ప్రారంభం

స్టేట్ న్యూస్ తెలుగు / ఖమ్మం

నేలకొండపల్లి టౌన్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ సిపి గౌతమ్, విస్తృతంగా పర్యటించారు. బౌద్ధ స్తూపం ప్రాంతాన్ని , నూతనంగా నిర్మాణమైన గెస్ట్ హౌస్ ను పరీక్షించారు. బౌద్ధ స్తూపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, బౌద్ధ స్తూపం పరిసర ప్రాంతాలను గార్డెనింగ్ మొక్కలతో అలంకరించాలని, బౌద్ధ స్తూపం కు వచ్చే సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ముజ్జిగూడెం గ్రామంలో నూతన వెటర్నరీ హాస్పిటల్ ను ప్రారంభించారు, తిరుమలపురం గ్రామంలో నూతన పంచాయితీ భవనం ప్రారంభించారు.  నేలకొండపల్లిలో నూతన లైబ్రరీ భవన సముదాయం కు శంకుస్థాపన చేశారు, మసీదును సందర్శించి ప్రార్థనలు చేసి మసీదు అభివృద్ధికి హామీ ఇచ్చారు.అలాగే దూర ప్రాంతముల నుండి వచ్చే డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు వారి చదువుకు ఆటంకం కలగకుండా, నూతనంగా నిర్మించబడిన హాస్టల్ వసతి గృహాలను మంత్రి  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంత్రి పొంగులేటి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్యదీక్షతోటి చదవాలని తల్లిదండ్రులకు గురువులకు ఊరికి మంచి పేరు తేవాలని, హితవు పలికారు. అలాగే, ఇంటర్ డిగ్రీ కాలేజీలను మోడల్ కాలేజీలుగా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు .  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కలెక్టర్ సిపి గౌతమ్, బాలసాని లక్ష్మీనారాయణ,బేబి స్వర్ణకుమారి,దయాకర్ రెడ్డి,ప్రిన్సిపల్ పరంజ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ యన్.మాధవరావు, ఎంపీటీసీ బర్నబాస్ ( బొందయ్య), వడ్డే నాగేశ్వరరావు,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి మల్ల బాబు రెడ్డి,శాఖమూరి రమేష్ రావు, మాజీ సర్పంచులు మామిడి వెంకన్న,వంగవీటి నాగేశ్వరరావు, ఎంపిటిసి సీతారావమ్మ, ఎంపీపీ రమ్య, మాజీ ఎంపిటిసి దోసపాటి కల్పన, తదితరులు పాల్గొన్నారు.